కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో హయ్యెస్ట్ మెజార్టీ
1985 తర్వాత కర్ణాటకలో ఏ పార్టీ రెండోసారి గెలవలేదు
నాలుగు దశాబ్దాలుగా ఓసారి కాంగ్రెస్, ఓసారి బీజేపీ
శిష్యుడి చేతిలో మాజీ సీఎం ఓటమి.. శ్రీరాములుకు గట్టి షాక్
బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ప్రముఖులు విజయం సాధించారు. మరికొందరు అనూహ్యంగా ఓడిపోయారు. ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తన శిష్యుడి చేతిలోనే ఓటమి పాలయ్యారు.
కొంపముంచిన రెబల్స్.. బెడిసికొట్టిన బీజేపీ అమెరికా మోడల్..కాంగ్రెస్‌కూ నష్టం
కర్ణాటక అసెంబ్లీలో రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్, బీజేపీ కొంపముంచారు. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు రెబల్స్‌గా బరిలోకి దిగారు. ఈ కారణంగా ప్రత్యర్థి పార్టీలు లాభపడ్డాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది.
1989లో 179 సీట్ల తర్వాత, ఇదే అత్యధికం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా వరుసగా ఏ పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు. సరిగ్గా చెప్పాలంటే 1985 నుండి రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ లేదు. 1983, 1985 సంవత్సరాలలో జనతా పార్టీ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. ఆ తర్వాత నుండి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి గెలవలేదు. 2013లో కాంగ్రెస్ పార్టీ గెలవగా, 2018లో బీజేపీ, ఇప్పుడు 2023లో తిరిగి కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో హయ్యెస్ట్ మెజార్టీ. 1989లో కాంగ్రెస్ 179 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ పార్టీయే 1999లో 132 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఏకంగా 136 స్థానాలు గెలిచి 1999 రికార్డును బద్దలు కొట్టింది. కాంగ్రెస్ పార్టీకి 1989లో వచ్చిన 179 సీట్ల తర్వాత అత్యధికం ఇదే. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 40 శాతానికి కాస్త అటు, ఇటుగా మాత్రమే ఉంది. బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం భారీగా తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. అధికారం విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ చెరోసారి అధికారంలోకి వస్తున్నాయి.