కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. విజయాల్లో మూడు పార్టీలు
ఖాతా తెరవగా కాంగ్రెస్ దూకుడు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు
వెలువడిన ఫలితాల సరళిని చూస్తే ఇప్పటివరకు హస్తం పార్టీ 10 స్థానాల్లో విజయం
సాధించి మరో 112 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ రెండు చోట్ల
గెలిచి 66 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 1 స్థానంలో విజయం సాధించి 26
చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మరో చోట్ల మందంజలో ఉన్నారు.
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ కనకపుర స్థానం నుంచి విజయం
సాధించారు.
ఎల్లాపురా స్థానంలో భాజపా అభ్యర్థి శివరామ్ గెలుపొందారు.
హసన్ నియోజకవర్గంలో జేడీఎస్ నేత స్వరూప్ విజయం సాధించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉదయం 11
గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ 122 స్థానాల్లో ఆధిక్యంలో
ఉండగా బీజేపీ 66 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జేడీఎస్ 30, ఇతరులు ఆరు
స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండటంతో పార్టీ శ్రేణులు
సంబరాలు మొదలుపెట్టారు. హస్తం పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు మిఠాయిలు
పంచుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.