మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఔదార్యం
ముంబయి : తన కుమారుడి వివాహంతో పాటు నిరుపేదలైన 25 జంటలకు మహారాష్ట్రలోని ఔసా
నియోజకవర్గ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ ఘనంగా సామూహిక విహహాలు జరిపించారు.
లాతూర్ జిల్లాలోని ఉటేజ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్
శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు. ఎన్సీపీ నేత అజిత్
పవార్, కేంద్రమంత్రి రావు సాహెబ్ దన్వే సహా పలువురు రాజకీయ నాయకులు హాజరై
కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కృషిని అందరూ ప్రశంసించారు.