న్యూఢిల్లీ : అగ్నివీర్లకు రైల్వేలో నాన్-గెజిటెడ్ ఉద్యోగాల్లో రెండు
అంచెల్లో 15% రిజర్వేషన్ లభించనుంది. దీంతోపాటు వయోపరిమితిలో సడలింపు
ఇస్తారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి వారికి మినహాయింపు ఉంటుంది. దివ్యాంగులు
(పర్సన్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీ-పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులు,
యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసినవారితో సమానంగా లెవెల్-1లో 10%,
లెవెల్-2 అంతకుమించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్‌ను
అగ్నివీర్లకు కల్పిస్తారు. తొలిబ్యాచ్ వారికి ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్‌ల
వారికి మూడేళ్లు చొప్పున సడలింపు ఇస్తారు. నాలుగేళ్లు అగ్నివీర్లుగా
ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్ మేనేజర్లకు రైల్వేబోర్డు లేఖలు
పంపింది. భర్తీకాని ఖాళీలు ఉంటే ఇతరులతో వాటిని నింపాలని తెలిపింది.
అగ్నివీర్ల కోసం రిజర్వేషన్ విధానాన్ని ఆర్పీఎఫ్ కూడా రూపొందిస్తున్నట్లు
సమాచారం.