నూతన రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడి
న్యూఢిల్లీ : అమెరికా-భారత్ సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి చేర్చడంపై
దృష్టిసారిస్తానని, భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు.
2021 జూన్ నుంచి భారత్లో అమెరికా రాయబారి పోస్టు ఖాళీగా ఉండగా ఇటీవలే
గార్సెట్టీ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపదీ
ముర్మును కలిసి తన నియామక పత్రాల్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
అమెరికా-భారత్ సంబంధాల విషయంలో కీలకమైన సమయంలో భారత్కు రావడాన్ని గౌరవంగా
భావిస్తున్నట్లు తెలిపారు.