కేటాయించాలి
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ను కోరిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు
జీవీఎల్ ప్రతిపాదనపై స్థల కేటాయింపుకు తక్షణ అవకాశాల పరిశీలనకు ఆదేశించిన
కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్
న్యూఢిల్లీ : కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తో
జరిగిన సమావేశంలో బిజెపి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం
రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులకు అనువుగా అవసరమైన “బల్బ్ లైన్” నిర్మాణం కోసం
విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి చెందిన భూమిని కేటాయించమని కేంద్ర మంత్రిని
కోరారు. రూ.85.28 కోట్ల వ్యయంతో క్విక్ ప్లాట్ ఫాం క్లియరెన్స్, లోకో
రివర్సల్, షంటింగ్ వంటి చర్యలను నివారించడం ద్వారా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
2016లోనే విశాఖ రైల్వేస్టేషన్ లో బల్బ్ లైన్ నిర్మించాలని నిర్ణయించగా ఇందుకు
అవసరమైన భూమిని ఇవ్వడానికి విశాఖ పోర్టు ట్రస్ట్ గతంలో నిరాకరించిందని,
ప్రజాహితం కోసం ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో, చిత్తశుద్ధితో పనిచేయాలన్నదే
ప్రధాని నరేంద్ర మోడీ నినాదమని, విశాఖ రైల్వేస్టేషన్ లో బల్బ్ లైన్
నిర్మాణానికి వాల్తేరు రైల్వే డివిజన్ కు అవసరమైన భూమిని ఇచ్చేలా, తద్వారా
రైళ్ల ట్రాఫిక్ ను తగ్గించి, ఎక్కువ రైళ్ల రాకపోకలకు, విశాఖ ప్రయాణికుల
సౌకర్యం కొరకు విశాఖ పోర్ట్ అథారిటీకి సూచించాలని కేంద్ర మంత్రి సర్బానంద
సోనోవాల్ ను ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.
బల్బ్ లైన్ నిర్మాణానికి ఇచ్చిన భూమికి బదులుగా విశాఖ పోర్టు అథారిటీ దానికి
పరిహారం లేదా ప్రత్యామ్నాయ భూమిని కోరవచ్చని ఎంపీ జీవీఎల్ లేఖలో మంత్రిని
కోరారు. అంతేకాక విశాఖలో సైనిక్ భవన్, సైనిక్ రెస్ట్ హౌస్ నిర్మాణానికి కూడా
విశాఖ పోర్టు భూమిని అందచేయాలని ఎంపీ జీవీఎల్ కేంద్ర మంత్రిని కోరారు. ఇది
ఎంతో ఉదాత్తమైన కార్యక్రమమని, ఈరకంగా దేశానికి విశిష్ట సేవలందించిన మాజీ
సైనికుల అవసరాలను తీర్చవచ్చని ఎంపీ జీవీఎల్ మంత్రికి తెలియచేశారు. ఈ విషయంలో
తాను రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ను కూడా కలిసి మాట్లాడినట్లు
తెలియచేసారు. కేంద్ర మంత్రి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రతిపాదనకు వెంటనే
సానుకూలంగా స్పందించడంతో పాటు, జీవీఎల్ చేసిన రెండు ప్రతిపాదనలను వెంటనే
పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఎంపీ జీవీఎల్ కేంద్ర మంత్రి
యొక్క సత్వర స్పందనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ప్రజలపై,
విశాఖ అభివృద్ది కొరకై చూపిస్తున్న ఈ చర్యల వల్ల విశాఖ ప్రజల, మాజీ సైనికుల
మనసులో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికీ నిలిచిపోతారన్నారు.