రాజసమంద్ : ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ని లక్ష్యంగా
చేసుకుని గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ప్రతికూల వ్యక్తులకు
దూరదృష్టి ఉండదు.. వారు కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు
అని నరేంద్రమోడీ అన్నారు. రాజస్థాన్‌లోని రాజసమంద్‌లో ప్రాజెక్టుల
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ
మాట్లాడుతూ నేను ఈరోజు కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించాను. మరొకొన్ని
ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాను. దాదాపు ఈ ప్రాజెక్టుల విలువ రూ. 5,500
కోట్లు. రాజస్తాన్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడంపై మా ప్రభుత్వం
దృష్టి సారిస్తోంది. ఈ రాష్ట్రంలో ముందే సరిపడా మెడికల్ కాలేజీలు నిర్మించి
ఉంటే వైద్యుల కొరత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రతి ఇంటికి నీరు వచ్చి
ఉంటే రూ. 3.5 లక్షల కోట్లతో జలజీవన్ మిషన్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఉండేది
కాదు. ప్రతికూల వ్యక్తులకు దూరదృష్టి లేదు. వారు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల
గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంతకుమించి వారు ఆలోచించలేరని ఆయన అన్నారు.
అలాగే మోడీ ‘కొంతమంది ప్రతికూలతలతో నిండి ఉన్నారు. వారు దేశంలో జరిగే మంచి
పనులను చూడలేరు. కేవలం వారు వివాదాలను సృష్టించడానికే ఇష్టపడతారు. వేగవంతమైన
అభివృద్ధికి ప్రాథమిక సౌకర్యాలతోపాటు, ఆధునిక మౌలిక సదుపాయాలు కూడా అవసరం’ అని
ఆయన అన్నారు.