కర్ణాటక అసెంబ్లీ పోరులో ఈసారి ‘వక్కలిగలు’ ఎవరికి జై కొడతారో..?
లింగాయత ఓట్ల కోసం కుస్తీ.. ఆ అభ్యర్థులకే పెద్దపీట.. సీఎం పదవీ వారికే
నాలుగోవంతు సీట్లు.. 20% ఓట్లు- ఇక్కడ గెలిస్తే.. అధికారం దక్కినట్టే!
బెంగుళూరు : ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తే ఈవీఎంలోని అభ్యర్థి పేరునే
ముందుగా చూస్తుంటాం. ఆ అభ్యర్థి పేరును పరిశీలించి ఓటు వేస్తుంటాం. కానీ ఒకే
పేరుతో ఇద్దరు అభ్యర్థులు ఉంటే?.. అవగాహన ఉన్నవారైతే పార్టీ గుర్తును బట్టి
అభ్యర్థికి ఓటు వేస్తారు. కానీ కాస్త ఏమరపాటుగా ఉంటే మాత్రం ఆ ఓటు వేరే
వ్యక్తికి వెళ్లిపోయినట్టే! ప్రస్తుతం కర్ణాటకలో ఇదే పరిస్థితి ఉంది. ఇది
యాదృచ్ఛికంగా జరిగినట్లు కనిపిస్తున్నా దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని
విశ్లేషకులు చెబుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ పోరులో ఈసారి ‘వక్కలిగలు’ ఎవరికి జై కొడతారో..?
వక్కలిగలు.. కర్ణాటకలో లింగాయత్‌ల తర్వాత రెండో అతిపెద్ద సామాజిక వర్గం.
కర్ణాటక జనాభాలో 15 శాతంగా ఉన్న వక్కలిగలను అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రసన్నం
చేసుకునేందుకు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ముమ్మరంగా
యత్నిస్తున్నాయి. కర్ణాటకను ఏలిన ఏడుగురు సీఎంలు సహా దేశ మాజీ ప్రధాని హెచ్డీ
దేవెగౌడ వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే. పాత మైసూర్ సహా బెంగళూర్‌లో
ఎక్కువగా ఉండే వక్కలిగలు దాదాపు 100 నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల
గెలుపోటములను శాసిస్తున్నారు. ఈసారి వీరు ఏ పార్టీకి జైకొడతారనేది ఆసక్తికరంగా
మారింది.
లింగాయత ఓట్ల కోసం కుస్తీ.. ఆ అభ్యర్థులకే పెద్దపీట.. సీఎం పదవీ వారికే
కర్ణాటక ఎన్నికలకు, లింగాయత సామాజిక వర్గానికి అవినాభావ సంబంధం ఉంటుంది.
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల తర్వాత అత్యధిక జనాభా ఉన్న లింగాయత ఓట్లు
రాబట్టుకునేందుకు పార్టీలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం అధికార
పార్టీపై వ్యతిరేకత, అవినీతి, రిజర్వేషన్ల సవరణలతోపాటు ‘లింగాయత సీఎం’
అభ్యర్థి అంశం ఎన్నికలను ప్రభావితం చేసే జాబితాలో చేరింది. ఇదే అంశంపై
పార్టీలు రసవత్తర రాజకీయాన్ని ప్రారంభించాయి. ఇటీవల ముగిసిన టికెట్ల
కేటాయింపుల్లోనూ అన్ని పార్టీలు లింగాయత అభ్యర్థులకు ఎక్కువ టికెట్లు ఇచ్చాయి.
నాలుగోవంతు సీట్లు.. 20% ఓట్లు- ఇక్కడ గెలిస్తే.. అధికారం దక్కినట్టే!
కర్ణాటకలో ఏపార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ జిల్లా కీలకం
కానుంది. ఎందుకంటే సాధారణ మెజార్టీ అయిన 113 స్థానాల్లో నాలుగో వంతు (28
నియోజకవర్గాలు) ఈ జిల్లాలోనే ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన
2008 ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుపొందగా ఆ తర్వాత జరిగిన 2013,
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించింది. ఈసారి బెంగళూరు
అర్బన్ జిల్లా ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారనేది ఆసక్తి రేపుతోంది.