కన్నడ ఓటర్ల మన్ననలు ఎవరికో?
‘ఫ్రీ’ హామీలతో ఓట్ల వేట : ఆ పార్టీ గెలిస్తే ఒకేసారి రూ.2లక్షలు!
బజరంగ్ బలీ చుట్టూ కర్ణాటక రాజకీయం : కాంగ్రెస్‌లో గుబులు.. నష్టం తప్పదా?
కర్ణాటకలో ‘నోటా’ కలవరం.. ఓటర్లు ‘జై’ కొడితే పార్టీల ఆశలు గల్లంతే!
బెంగుళూరు : సభలు, రోడ్‌షోలు, భారీ ర్యాలీలతో గత కొన్నిరోజులుగా హోరెత్తిన
కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బీజేపీ తరపున ప్రధాని నుంచి గల్లీ
స్థాయి కార్యకర్త వరకు, ప్రతిపక్షం నుంచి అగ్రనేత సోనియా గాంధీ నుంచి
బూత్‌లెవల్ నేత వరకు అవిశ్రాంతంగా చేసిన పోరాటం ముగిసింది. బుధవారం కన్నడ నాట
జరిగే ఎన్నికలకు ప్రచార తంతు పూర్తైంది. శనివారం వెల్లడి కానున్న ఫలితాల్లో
కన్నడ కంఠీరవ ఎవరో తేలనుంది.
‘ఫ్రీ’ హామీలతో ఓట్ల వేట : ఆ పార్టీ గెలిస్తే ఒకేసారి రూ.2లక్షలు!
కన్నడ ఓటర్లపై ప్రధాన పార్టీలు ఉచిత హామీల వర్షం కురిపించాయి. మేనిఫెస్టోల్లో
ప్రముఖంగా ఉచిత హామీల గురించే ప్రస్తావించాయి. ‘ఫ్రీ’ ప్రకటనల్లో కాంగ్రెస్,
జేడీఎస్‌లు ముందున్నాయి. బీజేపీ సైతం తమ విధానాలకు భిన్నంగా ఉచిత వాగ్దానాలు
చేసింది.
బజరంగ్ బలీ చుట్టూ కర్ణాటక రాజకీయం : కాంగ్రెస్‌లో గుబులు.. నష్టం తప్పదా?
కర్ణాటకలో ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల ప్రచార వ్యూహాలు
మారిపోయాయి. మొదట అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, నేతల ఫిరాయింపులపై వాగ్బాణాలు
సంధించుకున్న ఇరు పార్టీలు.. ఇప్పుడు రూటు మార్చాయి. ఎన్నికల ప్రణాళిక విడుదల
ద్వారా కాంగ్రెస్ ప్రచార వ్యూహం మార్చిన నేపథ్యంలో కమలనాథులు సైతం ప్రతిదాడి
మొదలుపెట్టారు. బజరంగదళ్పై నిషేధం, కేరళ స్టోరీ చిత్రం అంశాల ఆధారంగా హస్తం
పార్టీపై విమర్శల దాడి పెంచారు.
కర్ణాటకలో ‘నోటా’ కలవరం.. ఓటర్లు ‘జై’ కొడితే పార్టీల ఆశలు గల్లంతే!
ఎన్నికల బ్యాలెట్‌పై అని పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల గుర్తులతో పాటు నోటా
గుర్తు కూడా ఉంటుంది. చాలా మంది దీన్ని తేలికగా తీసుపారేస్తారు. అది ఎందుకు
పనికి రాదు. ఆ ఆప్షన్ పెట్టి వ్యర్థమని అనుకుంటారు. కానీ నోటా ఓట్లను అంత
తేలిగ్గా తీసిపారేయలేం. ఎందుకంటే కర్ణాటకలో 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో
చాలా మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించింది ఈ ఓట్లే.