పనాజి : లింగ అసమానతల అంతరాన్ని తగ్గించేందుకు గానూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు
పెద్ద ఎత్తున ఆర్థిక, డిజిటల్ రంగాల్లోకి కూడా ప్రవేశించాల్సి వుందంటూ ఇక్కడ
జి20 సమావేశాలకు హాజరైన మహిళా ప్రతినిధులు పేర్కొన్నారు. గోవాలో జి 20 మూడవ
డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూపు సమావేశానికి ముందుగా జరిగిన ప్యానెల్ చర్చలో
వారు పాల్గొన్నారు. ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’ అనే అంశంపై జరిగిన చర్చలో
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మాజీ అధ్యక్షురాలు మరియా ఫెరాుండా ఎస్పినోసా
పాల్గొన్నారు. ఈనాడు కూడా మహిళలు తమకుతాము నిరూపించుకోవడం కోసం నిరంతరంగా
శ్రమిస్తూనే ఉన్నారన్నారు. మహిళా నాయకత్వానిు అనుమతించే, స్వాగతించేలా
సంస్థలను, వ్యవస్థలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఫెమినిస్ట్ భావజాలం
కలిగిన పురుషులతో సంబంధ బాంధవ్యాలు ఈ తరహా అభివృద్ధికి ఎంతో
కీలకమనివ్యాఖ్యానించారు. ఈనాడు ఉపాధి మార్కెట్లలో మహిళల ప్రాతినిధ్యానికి
టెక్ చైతన్యం పెద్ద అవరోధంగా నిలిచిందని గర్ల్ హైప్ సిఇఎ బరతంగ్ మియా
వ్యాఖ్యానించారు. డిజిటల్ సమాచారాన్నిర్ ఎక్కువగా ఉపయోగించే మహిళలు
వాటినిసృష్టించడానికి అవసరమయ్యే ఆల్గరిథమ్ల్లో కూడా ఆద్యులు కావాల్సిన అవసరం
ఉందన్నారు.