తరలివచ్చిన కార్యకర్తలు
బెంగుళూరు : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెగా
రోడ్‌షోను నిర్వహించారు. నగరంలో దాదాపు 26 కిలోమీటర్ల పాటు కన్నడ ప్రజలకు
అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
కర్ణాటక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార బీజేపీ ప్రచారాన్ని వేగవంతం
చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 26.5 కిలోమీటర్ల మేర మెగా
రోడ్ షోను చేపట్టారు. ఇటీవలే నైస్ రోడ్ జంక్షన్ నుంచి బెంగళూరు నార్త్
నియోజకవర్గంలోని సుమనహల్లి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ. తాజాగా బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో మెగా రోడ్ షోను చేపట్టారు.
శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోడ్ షో మధ్యాహ్నం 12.30 గంటల వరకు
సాగుతోంది. సోమేశ్వర్ భవన్ నుంచి బెంగళూరు సౌత్‌లోని మల్లేశ్వర్ సంకి ట్యాంక్
వరకు దాదాపు 26.5 కిలోమీటర్లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని 34
రోడ్లను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసివేయనున్నారు.
వాహనదారులు వేరొక మార్గాన్ని ఎంచుకోవాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఆదివారం 8 కిలోమీటర్ల మేర మరో రోడ్‌షో చేపట్టనున్నారు ప్రధాని మోదీ. కెంపెగౌడ
విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు సాగనుంది.నగరంలోని అన్ని ప్రాంతాల్లో
పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు రెండు రోజుల రోడ్ షో పెట్టారని పార్టీ
వర్గాలు వెల్లడించాయి. ఒక రోజులో నగరమంతా పర్యటిస్తే ప్రజలకు ఇబ్బంది తలెత్తే
అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. నగరంలోని సంబంధిత
అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
చేశామని బీజేపీ ఎలక్షన్ నిర్వహణ కమిటీ కన్వీనర్ శోభా కరంద్లాజే చెప్పారు.