‘బాస్టిల్ డే’లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ప్రధాని
న్యూఢిల్లీ : పారిస్లో జులై 14న జరగనున్న బాస్టిల్ డే కవాతులో ప్రధాని
నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని భారత్ విదేశీ వ్యవహారాలశాఖ ఒక
ప్రకటనలో పేర్కొంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఆహ్వానం
మేరకు ప్రధాని ఫ్రాన్స్ వెళ్లనున్నారని తెలిపింది. కవాతులో ఫ్రెంచ్ సైన్యంతో
పాటు, భారత్ సాయుధ బలగాలూ కదం తొక్కనున్నాయి. ఆహ్వానాన్ని మన్నించిన మోదీకి
మెక్రాన్ ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు.