బళ్లారి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం బళ్లారికి విచ్చేస్తున్నారు.
ఆయన నగర శివార్లలోని కప్పగల్ రోడ్డులో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన
భారీ ఎన్నికల బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. రెండు రోజుల క్రితం ఉమ్మడి
జిల్లాలోని హొసపేటెకు విచ్చేసి భారీ ఎన్నికల బహిరంగ సమావేశంలో ప్రసంగించిన
మోదీ, బళ్లారి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని ప్రజలను బీజేపీ వైపు
తిప్పుకునేందుకు ఆయన రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని రాక తరుణంలో
జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు
చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు మిలిటరీ బలగాలు కూడా నగరంలో మోహరించాయి.
సభాస్థలి వద్ద ఎస్పీజీ భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలను మోడీ
సమావేశానికి సమీకరించేందుకు, దాదాపు 80 వేలకు పైగా కుర్చీలను సభాస్థలి వద్ద
ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి జిల్లా ఇన్చార్జి
మంత్రి, గ్రామీణ అభ్యర్థి శ్రీరాములు, నగర బీజేపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డి
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మోడీతో పాటు పలువురు కేంద్ర బీజేపీ నాయకులు
కూడా పాల్గొంటున్నారు.