బెంగళూరు : ప్రత్యర్థి ఎంత స్థాయి వ్యక్తి అయినా ముందూ వెనుకా లేకుండా
మాట్లాడటం, అడ్డూ అదుపూ లేని విమర్శలు, ఆపై వాటికి కౌంటర్లు, వీటికి అనుబంధంగా
సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యాస్త్రాలు, ట్యాగులతో సందేశాలు. వెరసి కర్ణాటక
ఎన్నికల్లో ప్రచారం కాస్త పట్టుతప్పిన ప్రసంగాలకు వేదికగా మారింది. ప్రచార
ప్రవాహంలో ఓ మాట అనేయటం, ఆపై క్షమాపణ చెప్పటం.. అహం అడ్డొస్తే క్షమాపణ
చెప్పేదిలేదని భీష్మించడం.. నెల రోజులుగా రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో
జరుగుతున్న తంతును గమనిస్తున్న ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది.
ఎన్నికల ప్రవర్తన నిబంధనావళి (ఎంసీసీ)లోని ‘ఏ నుంచి డీ క్లాజు’లన్నింటికీ పని
చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనతో నోటు దురుసు నేతలకు కళ్లెం
వేసినట్లే. కేవలం ప్రకటనతోనే కాకుండా నోటీసులు కూడా జారీ చేసిన ఈసీ- వారు
వీరన్న వ్యత్యాసం లేకుండా గురువారం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సాధారణ
రోజుల్లోనే ఇట్టే నోరు పారేసుకునే బసవనగౌడ యత్నాళ్ (భాజపా), శాసనసభ, బహిరంగ
సభ, సామాజిక మాధ్యమం..ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యర్థులపై విరుచుకుపడే
ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్)లకు ఈసీ నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా
మారింది. అసలు ఈ ‘విష పూరిత’ ప్రచారానికి ఆద్యులైన మల్లికార్జున ఖర్గే కూడా
త్రుటిలో తప్పించుకున్నారు. అయినా.. ఈసీ వెల్లడించిన ప్రకటనలో ఏఐసీసీ అధ్యక్ష
స్థాయిలో ఉన్న నేత, ప్రధాని స్థాయిలోని నేతను అనాల్సిన మాటలేనా అంటూ చురకలు
అంటించింది. పార్టీలేవైనా ప్రధాని ఓ దేశానికి నేత. ప్రజాభిప్రాయంతో గెలిచిన ఓ
దేశాధినేతను ఇష్టానుసారం విమర్శిస్తే అది దేశ ప్రతిష్ఠతను కూడా
దెబ్బతీసినట్లేనని ఈసీ అభిప్రాయపడింది. ఈ విమర్శలు కేవలం దేశానికే పరిమితం
కాకుండా గతంలో ప్రధానికి అమెరికా కూడా వీసా ఇవ్వలేదన్న విమర్శ ప్రపంచ స్థాయిలో
చర్చకు వచ్చే అంశమని చర్చకు వచ్చే అంశమని ప్రస్తావించింది. సాంకేతిక యుగంలో ఓ
నేత చేసే అనాలోచిత విమర్శ క్షణాల్లో వైరల్గా మారటంపై ఈసీ ఆందోళన వ్యక్తం
చేసింది. సరిగ్గా ఎన్నికలకు వారం రోజుల ముందు ఈసీ ఇచ్చిన ఈ ‘షాకు’ నేతల
నోళ్లకు కళ్లెం వేస్తుందేమో చూడాలి.