బెంగళూరు : ఎన్నికల ప్రణాళికలో బజరంగదళాన్ని నిషేధిస్తామన్న హామీపై ఓ వైపు
బీజేపీ, మద్దతు సంఘాల విరుచుకుపడుతున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారాన్ని
పరుగులు పెట్టించే ప్రయత్నాన్ని ఆపలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక,
ఖర్గే కలబురగి, బీదర్, విజయపుర జిల్లాలను చుట్టేశారు. అన్ని చోట్లా
కాంగ్రెస్‌కు ఓ అవకాశమిస్తే సంక్షేమ రాజ్యాన్ని కళ్లముందు ఉంచుతామని
హామీనిచ్చారు. బీజేపీ పై ఒంటికాలిపై లేచి అవినీతి ప్రభుత్వమంటూ
విరుచుకుపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖేర్గే ఉత్తర కర్ణాటక
పర్యటనలో మమేకమై శ్రేణులను ముందుకు నడిపారు. ఆళందలో నిర్వహించిన బహిరంగ సభలో
ఆయన ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మండ్య జిల్లాలో
పర్యటించారు. చక్కెర నాడుగా వినుతికెక్కిన పాండవపురలో ఆయన ఎన్నికల ప్రచార
కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తొలుత మైసూరు జిల్లా నంజనగూడలో రోడ్‌షో
నిర్వహించిన ఆయన ‘పాత మైసూరు ప్రాంతంలో ఈసారి కాంగ్రెస్ పట్టుసాధిస్తుందని
విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతునాడు మండ్యలో
పర్యటించారు.