చరిత్ర ఉంది. ఇక్కడి నుంచే ఎక్కువ మంది ముఖ్య మంత్రులు ఎన్నికయ్యారు. దీంతో
పాటు చాలా మంది రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. భారత్‌కు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంతో కలిపి మైసూరు ప్రత్యేక రాష్ట్రంగా
ఏర్పడింది. తర్వాత మైసూరు మహారాజులు ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి పునాది వేశారు.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఓల్డ్ మైసూరు ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది.
స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడి వారికి రాజకీయ పరిజ్ఞానం ఉండేది. ఏకీకరణకు
ముందు కర్ణాటక మైసూరులోనే అంతర్భాగంగా ఉండేది. బెంగళూరు నగరం కాకుండా కోలార్,
బెంగళూరు రూరల్, రామనగర, మండ్య, హాసన్, మైసూరు, కొడగు, చామరాజనగర్,
చిక్కబల్లాపూర్, తుమకూరు అనే 10 జిల్లాలు కలిపి ఓల్డ్ మైసూరు రీజియన్‌గా
ఏర్పడింది. ఇక్కడ మొత్తం 61కి పైగా నియోజకవర్గాలుండేవి.
ఇక్కడ గత 50 ఏళ్లలో రాజకీయ చరిత్రను పరిశీలిస్తే మన దేశానికి ప్రధానిగా
సేవలందించిన హెచ్.డి. దేవెగౌడ ఇక్కడి హాసన్ జిల్లాకు చెందిన వ్యక్తి.
కర్ణాటకను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఆ
రాష్ట్ర మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ మండ్య జిల్లాకు చెందిన వారు.
రైతుల రుణాలు మాఫీ చేసి దేశ దృష్టిని ఆకర్షించిన నేత, మాజీ సీఎం కుమార స్వామి
రామనగర జిల్లా ప్రస్తుత ఎమ్మెల్యే. వెనుకబడిన తరగతుల వారికి మార్గదర్శి దేవరాజ
అరసు.. మైసూరు జిల్లాలోని హన్సూర్ నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎన్నికయ్యారు.
ఆయన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యదీ
ఇదే జిల్లా. శంకర్ గౌడ, చౌడయ్య, మాదే గౌడ (మండ్య), కృష్ణప్ప (కోలార్) లాంటి
ప్రముఖ నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు. ఇక్కడ 1950 నుంచి 2008
వరకు కాంగ్రెస్, జనతాదళ్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. 2008 తర్వాత బీజేపీ
పుంజుకోవడం ప్రారంభించింది. గత పదేళ్లలో ఓల్డ్ మైసూరు ప్రాంతంలో ఆ పార్టీ అనేక
నియోజకవర్గాల్లో విజయం సాధించడం ద్వారా క్రమంగా ఎదుగుతోంది. ప్రస్తుతం రానున్న
ఎలక్షన్లలో ఇక్కడ కాంగ్రెస్, జేడీ(ఎస్), బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ
జరగబోతోంది. ఈ రీజియన్‌లో ఒక్కలిగ అనే సామాజిక వర్గం ప్రజలు అధికంగా ఉండటం వల్ల
వారిని ఆకర్షించేందుకు 3 పార్టీలూ అనేక వ్యూహాలు రచిస్తున్నాయి.
ఆయా పార్టీల వ్యూహాలు
ఓల్డ్ మైసూరు రీజియన్‌లో గెలుపొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
పాత మైసూరులో భాగమైన మండ్య, మైసూరు, చామరాజనగర్, హాసన్ సహా జిల్లాల్లో అధిక
స్థానాలు కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం ప్రధాని మోదీని
ఎన్నికల ప్రచారానికి రప్పించాలని చూస్తోంది. ఇక్కడి సంప్రదాయ ఓట్లను
నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. మిగిలిన
జేడీఎస్ కూడా ఇక్కడ పంచరత్న రథయాత్ర నిర్వహించడం ద్వారా భారీ స్థాయిలో ఓట్లు
గెలుచుకోవాలని ఆశిస్తోంది.
ఓల్డ్ మైసూరులో 2013లో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ 28, కాంగ్రెస్ 27
స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. 2018లో
జేడీఎస్ 31, కాంగ్రెస్ 19, బీజేపీ 10 సీట్లు గెలుచుకున్నాయి. చాముండేశ్వరి
నియోజకవర్గంలో సిద్ధరామయ్య స్వయంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తాను పోటీ
చేసిన రెండు నియోజకవర్గాల్లో (చన్నపట్టణ, రామనగర) కుమారస్వామి రెండింటిలోనూ
విజయం సాధించారు.