న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1 వ్యవహారంపై దాఖలైన
పిటిషన్ను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు
సూచించింది. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్పై
విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ కేసుపై
ఏపీ హైకోర్టు విచారణ ముగించి తీర్పును వాయిదా వేసింది. తీర్పు జాప్యంపై
పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం
విచారణ చేపట్టింది. జనవరి నుంచి తీర్పు పెండింగ్లో ఉన్నట్లు పిటిషనర్ల తరఫు
న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీలైనంత త్వరగా తుదితీర్పు
ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.