ఇక్కడ గెలిస్తే..అధికారం దక్కినట్టే!
బెంగుళూరు : కర్ణాటకలో ఏపార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ జిల్లా
కీలకం కానుంది. ఎందుకంటే సాధారణ మెజార్టీ అయిన 113 స్థానాల్లో నాలుగో వంతు (28
నియోజకవర్గాలు) ఈ జిల్లాలోనే ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన
2008 ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుపొందగా ఆ తర్వాత జరిగిన 2013,
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించింది. ఈసారి బెంగళూరు
అర్బన్ జిల్లా ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారనేది ఆసక్తి రేపుతోంది.