కాఠ్మాండూ : నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ (78)ను బుధవారం ఎయిర్
అంబులెన్సులో దిల్లీకి తీసుకురాగా చికిత్స నిమిత్తం ఆయన ఎయిమ్స్‌లో చేరారు.
ఛాతీకి సంబంధించిన ఇన్ఫెక్షనుతో శ్వాస సరిగా అందక పౌడెల్ ఇబ్బంది
పడుతున్నట్లు వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. తొలుత కాఠ్మాండూలోని త్రిభువన్
యూనివర్సిటీ బోధనాసుపత్రిలో మంగళవారం ఆయనను చేర్చారు. నేపాల్ ప్రధాని పుష్ప
కమల్ దహల్, ఉప ప్రధాని పూర్ణ బహదూర్ ఖడ్కా ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని
ఆరా తీశారు. నెల వ్యవధిలో పౌడెల్ ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. ప్రాథమిక
చికిత్సల అనంతరం బుధవారం ఉదయం 10.30 గంటలకు కాఠ్మాండూ నుంచి ఢిల్లీ లోని
ఎయిమ్స్‌కు ఆయనను తరలించారు.