లింగాయత్‌లే కీలకం.. పీఠం ఎవరిదో?
బెంగుళూరు : కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కిట్టూర్-కర్ణాటక
ప్రాంతం కీలకంగా మారింది. మెుత్తం 7 జిల్లాల పరిధిలో 50 అసెంబ్లీ స్థానాలున్న
ఈ ప్రాంతంలో లింగాయత్‌లదే ఆధిపత్యం. గతంలో ముంబయి-కర్ణాటకగా పిలుచుకునే ఈ
ప్రాంతానికి 2021లో కిట్టూర్-కర్ణాటకగా ప్రభుత్వం నామకరణం చేసింది. 1990 వరకు
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ బెల్ట్‌లో యడియూరప్ప చరిష్మాతో దశాబ్దానికి పైగా
భాజపా చక్రం తిప్పింది. మధ్యలో 2013లో కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ దాన్ని
నిలుపుకోలేకపోయింది. ఈ ప్రాంతంలో హోరాహోరీ పోరు నెలకొన్న వేళ ఇక్కడి ఓటర్లను
ప్రసన్నం చేసుకుని అధికార పీఠాన్ని వశం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ
భావిస్తున్నాయి.