న్యూఢిల్లీ : ఏపీలో వాలంటీర్ల దినపత్రికల కొనుగోలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం
జారీ చేసిన జీవోలపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న
ధర్మాసనం కేసు విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఏపీలో వాలంటీర్లు
దినపత్రిక కొనుగోలు చేసేలా ఇచ్చిన జీవోలపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ
జరిగింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్
ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాదనలు విన్న సీజేఐ
జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసు విచారణను ఢిల్లీ
హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.200తో వాలంటీర్లు ప్రతి
నెలా పత్రిక కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం గతంలో 2 జీవోలు జారీ చేసింది.
అయితే ఆ ఉత్తర్వులను ఉషోదయ పబ్లికేషన్స్ సవాలు చేసింది. సోమవారం జరిగిన
వాదనల్లో ఈ వ్యవహారంపై ఏపీ కోర్టులో విచారణకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వ
న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తే
ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ అలాంటి
అభిప్రాయానికి తావు లేకుండానే ఉత్తర్వులిస్తామని చెప్పారు. కేసు మెరిట్స్‌లోకి
వెళ్లలేదన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తుది విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టుకు
సూచించింది.