ఇదో వింతైన రైల్వే స్టేషన్. టికెట్ కౌంటర్ మహారాష్ట్రలో ఉంటే స్టేషన్
మాస్టర్ మాత్రం గుజరాత్లో కూర్చుంటారు.
నవాపుర్ రైల్వేస్టేషన్ ప్రత్యేకత ఇది. ఎందుకంటే ఈ స్టేషన్ మహారాష్ట్ర,
గుజరాత్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. స్టేషన్లో కొంత భాగం మహారాష్ట్రలో ఉంటే
మిగిలినది గుజరాత్లో ఉంటుంది. అదే పశ్చిమ రైల్వే జోన్ పరిధిలో ఉన్న నవాపుర్
రైల్వే స్టేషన్. దేశంలో ఈ ఒక్క రైల్వే స్టేషన్‌కే ఈ ప్రత్యేకత ఉంది. ఈ
స్టేషన్ పొడవు 800 మీటర్లు. అందులో 500 మీటర్లు గుజరాత్‌లోని తాపి జిల్లాలో,
మిగతా 300 మీటర్లు మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉంటుంది.
ఇక్కడ ఉన్న ఓ బెంచీలో సగ భాగం మహారాష్ట్రలో ఉంటే మరో సగం గుజరాత్లో ఉంటుంది.
బెంచీ మీద రెండు వైపులా రెండు రాష్ట్రాల పేర్లుంటాయి. ఓ వైపు కూర్చుంటే
మహారాష్ట్రలోనూ, మరోవైపు కూర్చుంటే గుజరాత్‌లోనూ ఉన్నట్లన్నమాట. దీంతో చాలా
మంది ప్రయాణికులు ఇక్కడ సెల్ఫీలు దిగుతారు. బాంబే ప్రావిన్సుగా ఉన్నప్పుడు ఈ
స్టేషన్‌ను నిర్మించారు. బాంబే ప్రావిన్సును మహారాష్ట్ర, గుజరాత్‌లుగా
విభజించిన తర్వాత సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్‌ను రెండు రాష్ట్రాలూ పంచుకున్నాయి.