ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్‌గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని వైద్యరంగ
నిపుణలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా
వ్యాపిస్తుండటం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం
పెరుగుతున్నాయి. అటు మరణాలు కూడా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24
గంటల వ్యవధిలో 6,155 మంది కొవిడ్ వైరస్ బారిన పడగా.. పాజిటివిటీ రేటు 5శాతం
దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్
వ్యాపిస్తున్న ప్రాంతాలను (ఎమర్జెన్సీ హాట్‌స్పాట్స్) గుర్తించి దాని
కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
తాజా వ్యాప్తికి ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్ గా పిలిచే కొత్త
వేరియంట్ కారణమని వైద్యరంగ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ
వేరియంట్‌కు సంబంధించి 100కు పైనే కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గత
వేరియంట్లతో పోలిస్తే ఎక్స్‌బీబీ.1.16 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని
వైద్యరంగ నిపుణులు హెచ్చరించారు. ఈ వేరియంట్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా
ఉండాలని సూచిస్తున్నారు.
పిల్లల్లో కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు గుర్తింపు : కొవిడ్ బారిన పడుతున్న
పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం
ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కరోనా బాధితుల్లో ఈ
పరిస్థితి కనిపించలేదని పేర్కొన్నారు. కాబట్టి కొత్త వేరియంట్ వల్లే కళ్లలో
పుసులు, దురద వస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు. వీటికి అదనంగా- గతంలో ఉన్నట్లే
అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఇప్పుడూ కరోనా బాధితుల్లో
కనిపిస్తున్నాయని చెప్పారు. దేశంలో కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 లేదా
ఆర్ట్కురుస్‌గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని నిపుణలు అభిప్రాయపడుతున్న
సంగతి గమనార్హం.
తాజా కొవిడ్ గణాంకాలు ఇలా ఉన్నాయి
* 24 గంటల్లో కొత్త కేసులు – 6,155 (మొత్తం కేసులు 4.47 కోట్లు)
* యాక్టివ్ కేసులు – 31,194 (0.07శాతం)
* 24 గంటల్లో మరణాలు – 11 (ఇప్పటివరకు మొత్తం మరణాలు 5,30,954)
* రోజువారీ పాజిటివిటీ రేటు – 5.63శాతం
* మొత్తం కోలుకున్న వారు – 4.41కోట్లు
* రికవరీ రేటు – 98.74శాతం