ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేదు
కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలి
దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యం
అధిష్టానం తనకు ఏ పని అప్పగిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదని మాజీ
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తప్పుడు నిర్ణయాల వల్లే
కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. విభజన తర్వాత ఏపీలో
కాంగ్రెస్ చెల్లాచెదురైందన్నారు. విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా
నిర్ణయం తీసుకుందన్నారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు.
బీజేపీ ఎదుగుతున్నకొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందన్నారు. కిరణ్ కుమార్
రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి,
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు
లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి
పార్టీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్ అందించారు. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా
కప్పి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1980లో
7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్ 2019లో 37 శాతానికిపైగా పెరిగిందని
కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తమది 1952 నుంచి కాంగ్రెస్ కుటుంబమన్నారు.
అయితే ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. కాంగ్రెస్
హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలన్నారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్
లేకుండా పోయారన్నారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యమన్నారు.
గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే ఉందన్నారు. నరేంద్ర మోడీ, అమిత్‌షా
డైరెక్షన్లో బీజేపీ దూసుకుపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
అధిష్టానం తనకు ఏ పని అప్పగిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని కిరణ్
కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.