వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ : గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని నిరుపేదలకు రాజధానిలో ఇళ్ల
స్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న
నిర్ణయంతో రాష్ట్రంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న
ప్రాధాన్యతకు అద్దం పడుతోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన
కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు
అంశాలు వెల్లడించారు. 1134.58 ఎకరాల్లో 48218 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపారు.
రాజకీయాలంటే మానవ సంబంధాలు : రాజకీయాలంటే మానవ సంబంధాలని, ప్రజలకు జవాబుదారీ
తనం గా ఉండాలని ఇదే తన తండ్రి దగ్గర నుంచి తాను నేర్చుకున్నానని ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షలో చెప్పారని
విజయసాయి రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో లేకపోతే ప్రజలు
నష్టపోతారని, గడపగడపకు కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
సీరియస్ గా తీసుకోవాలని, సమిష్టిగా కలిసి ముందుకు సాగుదామని సమీక్షలో సీఎం
జగన్ పిలుపునిచ్చారని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ బోర్డు :ప్రతి ఏడాదీ 5 లక్షలకు పైగా
జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మరణిస్తున్నారని ఈ మేరకు రోడ్
సేఫ్టీ బోర్డు ఏర్పాటు ఆమోద నిర్ణయం ఎంతో అవసరమని విజయసాయి రెడ్డి అన్నారు.
బోర్డు ఏర్పాటుతో రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణ ప్రమాణాలు సక్రమంగా
నిర్వహించబడతాయని విజయసాయి రెడ్డి అన్నారు.