న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జ్, కేంద్రమంత్రి
మురళీధరన్‌తో జనసేన నేతల భేటీ ముగిసింది. ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్
కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మురళీధరన్‌తో
గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులతోపాటు
జనసేన, బీజేపీ కార్యాచరణపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల
మధ్య దూరం పెరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలు బాహాటంగానే ప్రకటించిన విషయం
తెలిసిందే. జనసేనతో కలిసి ఉన్నా, లేకపోయినా ఒకటేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
గతంలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రెండు పార్టీల పెద్దలు ఢిల్లీలో
భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ అనంతరం జనసేన అధినేత
పవన్ కల్యాణ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఇంకా పలువురిని కలవాల్సి
ఉందని, అందరినీ కలిసిన తర్వాత మాట్లాడుతానని వెల్లడించారు.