న్యూఢిల్లీ : ఏపీలో జాతీయ రహదారుల అభివృద్దికి వరుసగా నాలుగో ఏడాదీ కూడ
కేంద్రం నుండి రికార్డు స్థాయిలో నిధులను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం సాధించిందని
రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు
విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ గారి స్పష్టమైన ప్రణాళికతో
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి నాలుగు ఏళ్ల కాలంలో రూ.23,471.92 కోట్లు
కేంద్రం నుండి నిధులు సాధించగా,గత టిడిపి ఐదేళ్ల కాలంలో రూ.10,660 కోట్లు
మాత్రమే సాధించిందని ఆయన చెప్పారు.
భూముల రీసర్వే అత్యంత ప్రాధాన్యం
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు,భూరక్ష పథకానికి ముఖ్యమంత్రి జగన్ అత్యంత
ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు.
ఇతర రాష్ట్రాలకన్నా మిన్నగా పెద్ద స్థాయిలో భూముల రీసర్వే కార్యక్రమం
జరుగుతుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయని విధంగా భూ
హక్కు పత్రాలలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అందిస్తుందని చెప్పారు. 2030 నాటికి మన ఎగుమతులను రెండు ట్రిలియన్ల డాలర్లకు
పెంచే లక్ష్యంతో కొత్త విదేశీ వాణిజ్య విధానం 2023న్ని రూపోందిచడాన్ని
స్వాగతిస్తూ ప్రధాని మోదీని అభినందించారు. ఈ మేరకు శనివారం పలు అంశాలపై సోషల్
మీడియాలో స్పందించారు..