ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని
నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కట్టడికి
తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి
నివారణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
అలాగే అన్ని రాష్ట్రాలను కొవిడ్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆస్పత్రుల్లో రోగులు, వైద్యులు, ఇతర సిబ్బంది మాస్క్ ధరించడం వంటి తగు
జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు
రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలని,
ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సలహా ఇచ్చారు. దేశంలో కరోనా
కేసులు, ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర
మోడీ దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కేసుల కట్టడి కోసం
తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కరోనా ఇంకా ముగియలేదు : ప్రధాని నరేంద్ర మోడీ
కరోనా కథ ఇంకా ముగియలేదని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అందరూ అప్రమత్తంగా
ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరముందని అధికారులకు
గుర్తుచేశారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్- వ్యాక్సినేషన్-మాస్క్ ధరించడం వంటి
జాగ్రత్తలు పాటించడం-ల్యాబ్ టెస్టింగ్ అనే ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని
సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని
నిర్ధరించుకునేందుకు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సంబంధిత శాఖల
అధికారులకు మోదీ నిర్దేశించారు. ఏమైనా కొత్త వేరియంట్లు వ్యాప్తి
చెందుతున్నాయేమో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ లేబొరేటరీల సంఖ్యను
పెంచాలని ప్రధాని సూచించారు. ఈ సమావేశంలో భారతదేశంలో పెరుగుతున్న కేసులతో సహా
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 పరిస్థితిని విశ్లేషిస్తూ ఒక సమగ్రమైన ప్రదర్శనను
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదర్శించారు. అయితే 2023 మార్చి 22 వరకు
దేశంలో సగటును 888 రోజువారీ కరోనా కేసులు. ప్రపంచవ్యాప్తంగా సగటున 1.08 లక్షల
రోజువారీ కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.