న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి న్యూఢిల్లీలో
స్థలం కేటాయించాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్
సింగ్ పూరీని వైసీపీ ఎంపీల బృందం కోరింది. రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ
పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎంపీ బృందం బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం
అందించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఎంపీలు సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ,
మాధవ్, బెల్లన చంద్రశేఖర్, బ్రహ్మానంద రెడ్డి, తలారి రంగయ్య తదితరులు ఉన్నారు.
అలాగే విజయసాయి రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుని న్యూఢిల్లీలోని
ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అనేక న్యాయ పరమైన
అంశాలపై చర్చించారు.ఈ సందర్బంగా కలియుగదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి
ప్రతిమను కేంద్రమంత్రికి అందించారు.