న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి దోహా బయల్దేరిన ఓ ఇండిగో విమానంలో మెడికల్
ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ
వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం దోహా
బయల్దేరిన ఓ ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానం
గాల్లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని దారి మళ్లించి పాకిస్థాన్లోని కరాచీలో
అత్యవసరంగా దించేశారు. ప్రయాణికుడిని పరీక్షించిన వైద్య సిబ్బంది అప్పటికే
మృతి చెందినట్లు ధ్రువీకరించారు.దీంతో ఆ ప్రయాణికుడి మృతదేహంతో సహా విమానం
తిరిగి దిల్లీ చేరుకుంది. మృతుడు నైజీరియాకు చెందిన 60 ఏళ్ల అబ్దుల్లా అని
గుర్తించారు. అతడి మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత లేదు. ఈ ఘటనపై ఇండిగో
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ప్రకటించింది. విమానంలోని ఇతర ప్రయాణికులను దోహా పంపించేందుకు ప్రత్యామ్నాయ
ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.