ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్
హరియాణా : ఆంగ్లేయుల పాలనలోనే మన విద్యావ్యవస్థ నాశనమైందని ఆరెస్సెస్ అధినేత
మోహన్ భాగవత్ అన్నారు. ఆయన ఇక్కడ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రిటిషర్ల
ఆధిపత్యం ప్రారంభం కాకముందు మన జనాభాలో 70% మంది అక్షరాస్యులు. విద్యావంతులు.
నాటి విద్యావిధానంతో అందరికీ ఉపాధి దొరికేది. నిరుద్యోగం దాదాపు శూన్యం. ఆ
రోజుల్లో ఇంగ్లాండ్ అక్షరాస్యత సుమారు 17%. మన దేశంలోకి వచ్చిన తర్వాత మన
విద్యా వ్యవస్థ నమూనాకు బ్రిటిషర్లు పాతరేశారు. వారి నమూనాను మనపై రుద్దారని
ఆరెస్సెస్ అధినేత తెలిపారు.