హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు అరుదైన అనుభూతి ఎదురైంది. ఐదు
దశాబ్దాల తర్వాత ఆయన తన డిగ్రీ పట్టాను అందుకున్నారు. నిజానికి మనోహర్ లాల్
ఖట్టర్ 1972లో దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ
ఏడాది నుంచి 1980 వరకు దాదాపు ఎనిమిదేళ్లు ఆయన దిల్లీలోనే ఉన్నారు. కానీ తన
డిగ్రీ పట్టా తీసుకోలేదు. దీనికి కారణం అప్పటి నుంచి వర్సిటీకి
వెళ్లకపోవడమేనని ఖట్టర్ వెల్లడించారు. కాగా దిల్లీ విశ్వవిద్యాలయం వైస్
ఛాన్స్లర్ ప్రొఫెసర్ యోగేశ్ సింగ్ చేతుల మీదుగా తన డిగ్రీ పట్టాను సీఎం
అందుకున్నారు.