ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప్రసారం చేసిన
‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదం కావడం తెలిసిందే.
దీనిపై బీజేపీ వర్గాలు బీబీసీపై భగ్గుమన్నాయి. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి
ఎస్. జై శంకర్ ఈ వివాదంపై స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీ యాదృచ్ఛికంగా
చేసింది కాదని స్పష్టం చేశారు. ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రసారం కావడం పలు
సందేహాలకు తావిస్తోందని అన్నారు. రాజకీయ ప్రోద్బలంతోనే బీబీసీ డాక్యుమెంటరీ
తయారైందని వెల్లడించారు. రాజకీయాలు కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా
జరుగుతుంటాయని అన్నారు. ఎక్కడో యూరప్ నగరంలో ఎవరిపైనో ఈ డాక్యుమెంటరీ చేసి
ఉంటే పట్టించుకుని ఉండేవారం కాదని పేర్కొన్నారు. భారత్ లో ఎన్నికల సీజన్
మొదలైందో లేదో తనకు తెలియదని, కానీ లండన్, న్యూయార్క్ లో మాత్రం ఎన్నికల సీజన్
మొదలైందని జై శంకర్ వ్యాఖ్యానించారు.