పుల్వామా : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత
జవాన్లు అమరులై నాలుగేళ్లు అయింది. 2019 వ సంవత్సరం ఫిబ్రవరి 14వతేదీన 40
మంది భారత జవాన్లు అమరులైన నాలుగేళ్ల తర్వాత ‘‘జవాన్ల అత్యున్నత త్యాగాన్ని
ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ట్విట్టర్లో వారి
త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
దేశంలో ప్రతి సంవత్సరం ఈ దాడిని ఖండిస్తూ పుల్వామా దాడి ఘటన మన దేశానికి చీకటి
రోజంటూ అమరవీరులకు నేడు నివాళులర్పిస్తోంది. పాకిస్తానీ ఉగ్రమూకల దాడిలో
వీరమరణం పొందిన అమరజవానుల సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరవరని, వారి సేవలను
దేశం స్మరించుకుంటోంది. వారికి దేశప్రజలు ఘననివాళులు అర్పిస్తున్నారు. ఈ ఘటన
పుల్వామా దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. క్రూరమైన
దాడిని ఖండిస్తూ ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలుపుతూనే ఉన్నారు. కాలిపోయిన
మృతదేహాలు, కాలిపోయిన ట్రక్కులు, మారణహోమం జరిగిన ప్రాంతం హృదయాన్ని కదిలించే
దృశ్యాలు అన్ని వార్తలలో నిలిచాయి.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల
చేసింది. పుల్వామా జిల్లాలోని లెత్పోరా వద్ద 22 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్ ఆదిల్
అహ్మద్ దార్గా పేలుడు పదార్థాలతో కూడిన వాహనాలను కాన్వాయ్‌లోకి ఎక్కించాడు.
అతను కాశ్మీర్ నివాసి, కుటుంబం ప్రకారం, 2018లో అదృశ్యమయ్యాడు. 2019 పుల్వామా
దాడి తర్వాత భారత్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఫిబ్రవరి 15, 2019న, విదేశాంగ
మంత్రిత్వ శాఖ ఈ దాడికి పాకిస్తాన్‌పై ఆరోపణలు చేసింది, అయితే పాకిస్తాన్
అలాంటి ఆరోపణలన్నింటినీ ఖండించింది. భారత ప్రభుత్వం వరుస సమావేశాల తర్వాత,
పాకిస్తాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
జవాన్ల మరణానికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. ప్రతీకార జ్వాలల్లో
ఊగిపోయింది. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.12 లక్షల ఎక్స్‌గ్రేషియా
ప్రకటించింది.
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీని కూడా
భారత్ 200 శాతానికి పెంచింది. అంతేకాకుండా, మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్
యాక్షన్ టాస్క్ ఫోర్స్ ని తన ‘బ్లాక్‌లిస్ట్’లో చేర్చాలని భారతదేశం కూడా
కోరింది. అందుకే ‘గ్రే లిస్ట్’లో స్థానం పొందింది. ఫిబ్రవరి 18, 2019
తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను
హతమార్చింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలు
ఆంక్షలు విధించారు.