సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల
భోపాల్ : కరోనాను ఎదుర్కొనేందుకు ముక్కు ద్వారా తీసుకునేలా దేశీయంగా తొలిసారి
తయారుచేసిన ‘ఇన్‌కొవాక్’ వ్యాక్సిన్‌ను ఈ నెల 26న అధికారికంగా
ఆవిష్కరించనున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్
ఛైర్మన్ కృష్ణ ఎల్ల భోపాల్‌లో ఈ విషయం వెల్లడించారు. ‘ఇండియా ఇంటర్నేషనల్
సైన్స్ ఫెస్టివల్’ సందర్భంగా విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. పశువుల్లో
ముద్ద చర్మం (లంపీ స్కిన్) వ్యాధిని నివారించేందుకు దేశీయంగా తాము తయారు
చేసిన ‘లంపీ-ప్రొవాక్ఇండ్’వ్యాక్సిన్‌ను వచ్చేనెలలో ఆవిష్కరించే అవకాశం
ఉందని చెప్పారు.