Home » వార్తలు » అంతర్జాతీయం » Page 107
కొద్ది నెలలుగా ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధం కీలక దశలోకి అడుగుపెట్టిన వేళ..పుతిన్ రైఫిల్‌ను కాల్చి చూశారు. మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక స్నైపర్ రైఫిల్‌ను కాలుస్తూ...
Read moreపశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని.. అక్కడ కొన్నిచోట్ల మహిళలు, చిన్నారులు కొంత కాలంగా ఆకులు, ఉప్పు తింటూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన...
Read moreలిథువేనియాకు చెందిన యూజెనిజస్ కవలియాస్కాస్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటో గ్రాఫర్ మైక్రోస్కోప్‌ను ఐదురెట్లు పెద్దదిగా చేసి చీమ ముఖాన్ని ఫొటో తీశాడు. ఈ ఫొటోకి నికాన్ వరల్డ్...
Read moreఇటీవలే దగ్గు మందు తాగి చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన మరువక ముందే ఇండోనేషియాలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిరప్‌లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఇండోనేషియాలో అన్ని సిరప్‌లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నెల రోజుల వ్యవధిలో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉండగా, మృతిచెందిన పిల్లలు.. ఆయా సిరప్‌లు తీసుకున్న తర్వాతే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్‌లు,...
Read moreప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీం జపాన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు(అక్టోబర్ 21న)ఈ చిత్రం జపాన్ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తారక్, రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి జపాన్‌లో వాలిపోయారు. అలాగే జక్కన్న ఇతర మూవీ టీం సభ్యులు కూడా జపాన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో దిగిన తారక్‌కు అరుదైన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో హోటల్ మహిళా స్టాఫ్ ఒకరు తారక్ దగ్గరికి వచ్చి ఓ లేఖను అందించింది. చదవండి: దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు అది చూసిన ఎన్టీఆర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఓ మై గాడ్ ఇక్కడ చాలా మంది ఉన్నారంటూ షాకయ్యాడు. అయితే ఆ లేటర్‌పై థ్యాంక్యూ అని రాసి ఉంది. దానిని హోటల్‌కు సంబందించిన సిబ్బంది అంత కలిసి ఇచ్చారని ఆమె చెప్పడంతో తారక్ ఫిదా అయ్యాడు. ఈ వారందరి తరపు ఆ లేటర్ తారక్ అందించి సదరు మహిళా స్టాఫ్ ఆ లేటర్ తానే రాశానని చెప్పడంతో ఎన్టీఆర్ ఆమెకు తిరిగి ధన్యవాదాలు తెలిపాడు. సో స్వీట్ ఆఫ్ యూ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. లేటర్‌పై ఉన్న పేర్లను చదివి ‘ఓ మై గాడ్ ఇక్కడ చాలామంది ఉన్నారు’ అంటూ షాకయ్యాడు. ప్రస్తుత్తం ఈ వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక జపాన్‌లో తారక్ క్రేజ్ చూసి నందమూరి అభిమానులంత మురిసిపోతున్నారు....
Read moreకెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది. ప్రధాని మోదీ,...
Read moreమనిషికి విశ్వాసం ఏమాత్రం?.. మూగజీవాలతో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువే!!. ఇది నిరూపించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది. ఆప్యాయంగా ఆయన్ని చూస్తూ.. హత్తుకుని.. కాసేపు అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్.. అడవి నుంచి వచ్చిన ఓ కొండముచ్చుకు రోజూ తిండి పెట్టేవారట. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన పార్థీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. ఆ కొండముచ్చు ఇలా తన విశ్వాసం.. ప్రేమను ప్రదర్శించింది. మరో ఘటనలో.. నంద్యాల డోన్ పట్టణం పాతపేటలో తనకు తిండి పెట్టిన ఓ మహిళ చనిపోతే శవయాత్రలో ఆ కొండ ముచ్చు పరుగులు తీసిన వీడియో ఒకటి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బలిజ లక్ష్మీదేవి అనే మహిళ బజ్జీల కొట్టు నడిపిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది....
Read moreఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం నడుమ రష్యా మరో వివాదానికి కారణమైంది. తమ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానానికి సమీపంలో.. రష్యా యుద్ధ విమానం ఓ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్ తాజాగా ఆరోపించింది. లండన్: ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం నడుమ రష్యా మరో వివాదానికి కారణమైంది. తమ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానానికి సమీపంలో.. రష్యా యుద్ధ విమానం ఓ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్ తాజాగా ఆరోపించింది. సెప్టెంబరు 29న నల్ల సముద్రం మీదుగా అంతర్జాతీయ గగనతలంలో గస్తీ విధుల్లో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. అయితే.. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు రష్యా పేర్కొనడం గమనార్హం. తమ నిరాయుధ విమానం(ఆర్‌ఏఫ్ ఆర్‌సీ- 135 రివెట్ జాయింట్) విషయంలో జరిగిన ఈ ఘటనను ఉద్దేశపూర్వక చర్యగా పరిగణించడం లేదని వాలెస్ తెలిపారు. అయితే.. రష్యా తన యుద్ధ విమానాలను వినియోగించే తీరు ఎంతటి విపత్కర పరిణామాలకు దారితీయగలదో ఇది వెల్లడిస్తుందన్నారు. ఈ విషయమై.. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగుతో తమ ఆందోళనను వ్యక్తం చేసినట్లు చెప్పారు.‘ఈ ఘటనపై తాము విచారణ జరిపినట్లు అక్టోబర్ 10న రష్యా రక్షణ శాఖ మంత్రి బదులిచ్చారు. సుఖోయ్- 27ఎస్...
Read moreబ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే వారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నుకుంటారని ఆమె ప్రకటించడంతో అందరిచూపూ భారత సంతతికి చెందిన రిషి సునాక్ పైనే పడింది. ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రధానిగా లిజ్ ట్రస్ రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వచ్చే వారం నాటికి తదుపరి ప్రధానిని ఎన్నుకుంటారని ఆమె ప్రకటించడంతో అందరిచూపూ భారత సంతతికి చెందిన రిషి సునాక్ పైనే పడింది. బ్రిటన్‌లో పరిణామాలకు సంబంధించి కొన్ని కీలక పాయింట్లు ఇవే.. బ్రిటన్‌లో ఆర్థిక మాంద్యం తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో తాను ఏ లక్ష్యంతోనైతే పదవి చేపట్టానో దాన్ని నిర్వర్తించే పరిస్థితిలేక రాజీనామా చేస్తున్నట్టు లిజ్ తెలిపారు. ఆమె చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే లక్ష్యంతో లిజ్ తీసుకున్న చర్యలు కన్జర్వేటివ్ పార్టీలో చీలికలు తీసుకొచ్చాయి. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ రోజులు (దాదాపు ఆరు వారాలు) ప్రధానిగా ఉన్న వ్యక్తి లిజ్ ట్రస్.లిజ్ ట్రస్ అధికారం చేపట్టిన తర్వాత గత నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మార్కెట్లు కుప్పకూలడం, పౌండ్ విలువ పతనం గందరగోళానికి దారితీసింది. అయితే, ఈరోజు ఆమె రాజీనామా ప్రకటించడంతో చోటుచేసుకున్న పరిణామాల వేళ పౌండ్ విలువ 0.36శాతం పెరిగినట్టు సమాచారం. కన్జర్వేటివ్ పార్టీ నేత జెర్మీ హంట్ తాను ప్రధాని రేసులో లేనని ప్రకటించారు. దీంతో తదుపరి ప్రధానిగా ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చలో ప్రధానంగా రిషి సునాక్ పేరే వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో రిషి ఓటమిపాలైన విషయం తెలిసిందే....
Read moreబ్రిటన్‌కు చెందిన డెయిలీ స్టార్ అనే పత్రిక వారం క్రితం ఓ పోటీ ప్రారంభించింది. కూరగాయ ముందుగా కుళ్లిపోతుందా? లిజ్ ట్రస్ పదవి ముందుగా పోతుందా? అనేది పోటీ! ఇంటర్నెట్ డెస్క్: ‘ఫలానా మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడు.. నాదీ 100 రూపాయల బెట్’.. ‘ఆ ఎన్నికల్లో ఫలానా పార్టీ గెలవకపోతే నేను ఇకపై ఓటెయ్య!’.. సాధారణంగా బెట్టింగ్‌లంటే ఇలానే ఉంటాయి. కానీ, బ్రిటన్‌లో గడిచిన వారం రోజులుగా ఓ బెట్టింగ్ నడిచింది. హోరాహోరీ పోరులో ఆ దేశ ప్రధాని లిజ్ ట్రస్‌పై ఓ కూరగాయ గెలుపొందింది. కూ..ర..గా..య.. గెలుపొందిందా? వినడానికి ఆశ్చర్యంగా కదూ! అయితే ఆ పోటీ ఏంటో తెలుసుకోవాలి. బ్రిటన్‌కు చెందిన డెయిలీ స్టార్ అనే పత్రిక వారం క్రితం ఓ పోటీ నిర్వహించింది. క్యాబేజీని పోలిన ఓ కూరగాయ ను ఒక పక్క.. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఫొటోను ఒక పక్క పెట్టింది....
Read more