న్యూయార్క్ : సిగరెట్ తాగే అలవాటుతో అరవై ఏళ్లు, అంతకు పైబడిన వయసు కలవారిలో
మానసిక సామర్థ్యాలు సన్నగిల్లుతాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ మేరకు
వెయిల్ కార్నెల్ మెడిసిన్, న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ పరిశోధకులు
వెల్లడించారు. వారి అధ్యయన ఫలితాలు గతేడాది డిసెంబరు 6న జర్నల్ ఆఫ్
అల్జీమర్స్ డిసీజ్‌లో ప్రచురితమయ్యాయి. ధూమపానం, మధుమేహం, హైపర్‌టెన్షన్
మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ కారకాలన్నీ ఏకమైనప్పుడు మెదడుకు
రక్తాన్ని సరఫరా చేసే కరోటిడ్ ధమనికి చెందిన అథ్లెస్క్లోరోటిక్ గట్టిపడటం
వంటి బ్రెయిన్ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మునుపటి అధ్యయనాలు తేల్చాయి. తాజా
పరిశోధనలో ధూమపానం, మధుమేహం, హైపర్టెన్షన్లు కలగలసినప్పుడు మానసిక
సామర్థ్యాలు దిగజారుతాయని తేలింది. ఇటువంటి సందర్భాల్లో రోగులకు ఎదురయ్యే
అదనపు అధిక ప్రమాద స్థితిపై వారికి సూచనలివ్వొచ్చని తెలిపింది. అధ్యయనం
సందర్భంగా 60 ఏళ్లు, అంతకు మించి వయసు కలిగిన 3007 మంది ఆరోగ్య సమాచారాన్ని
పరిశీలించారు. ఈ క్రమంలో ధూమపానం అలవాటును వదులుకొనేలా ప్రోత్సహించడం ద్వారా
వ్యక్తుల్లో చక్కని ఆలోచనలు, నేర్చుకునే, గుర్తుపెట్టుకోగల శక్తి వంటి
సామర్థ్యాలను కాపాడవచ్చని పరిశోధకులు తేల్చారు.