అమెరికాలోని మైన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మెగా మిలియన్స్
జాక్పాట్లో రూ.10,973 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో
నెలలో ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారాన్ని అన్లక్కీడేగా భావిస్తారు. కానీ అదే
రోజు అతడికి భారీ జాక్పాట్ తగలడం విశేషం. జనవరి 13న మెగా మిలియన్స్
జాక్పాట్ తీసిన డ్రాలో విన్నింగ్ టికెట్ సంఖ్యతో అతడి టికెట్లోని
30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిని విజేతగా ప్రకటించింది మెగా
మిలియన్స్ జాక్పాట్. అతడు గెలుచుకున్న మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు
29 ఏళ్లపాటు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. మొత్తం ఒకేసారి కావాలంటే రూ.7వేల
కోట్లు మాత్రమే ఇస్తారు. కానీ చాలా మంది వాయిదాల పద్ధతిలో కాకుండా ఒకేసారి
తీసుకుంటారు. 2018లో దక్షిణ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి రూ.12,436 కోట్లు
గెలుచుకున్నాడు.