మిస్ యూనివర్స్ పోటీల గురించే.
లూసియానా : దాదాపు 90 మంది పోటీదారులు..కిరీటం ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ.
ఇదంతా 71వ మిస్ యూనివర్స్ పోటీల గురించే. ఈ ఉత్కంఠకు తెరదించుతూ విశ్వసుందరి
2022 కిరీటాన్ని అమెరికా భామ ఆర్ బోనీ గాబ్రియేల్ అందుకుంది. మాజీ
విశ్వసుందరి హర్నాజ్ సంధు చేతుల మీదుగా శనివారం ఆమె స్వీకరించింది.
వెనెజువెలాకి చెందిన అమండ దుడమేల్ మొదటి రన్నరప్‌గా నిలవగా.. డొమినికన్
రిపబ్లిక్కు చెందిన అండ్రినా మార్టినెజ్ రెండో రన్నరప్‌గా నిలిచింది.
వాలీబాల్ ప్లేయర్.. ఫ్యాషన్ డిజైనర్ : విశ్వసుందరి గాబ్రియేల్
ఫిలిప్పినా-అమెరికన్‌కు చెందిన యువతి. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో
ఆమె డిగ్రీ పట్టా పొందింది. హైస్కూల్లో వాలీబాల్ ప్లేయర్. ఫ్యాషన్
డిజైనర్‌గా, మోడల్‌గా తర్వాత కాలంలో ఎదిగింది. పోటీల్లో అడిగిన ప్రశ్నలకు ఆమె
సమాధానం ఇస్తూ ‘‘ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టడం కన్నా మనకు నచ్చిన
అభిరుచిలోనే పెట్టుబడులు పెట్టి ప్రతిభను చాటుకోవాలి. మనందరిలో ప్రత్యేకత ఒకటి
ఉంటుంది. ఇతరులకు దాన్ని పంచితే అది మార్పునకు వాహకంగా మారుతుంది. మానవ అక్రమ
రవాణా, గృహహింస నుంచి తప్పించుకున్న మహిళలకు దుస్తులు కుట్టడంలో శిక్షణ
ఇస్తున్నానని తెలిపింది.