మాస్కో : ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో ఉక్రెనియన్ల కష్టాలను
పొడిగించడమే అవుతుందని క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. పైగా, ప్రస్తుత
పరిస్థితిలో ఏం మార్పు ఉండదని పేర్కొంది. రష్యాదాడులను దీటుగా ఎదుర్కొనేలా
అమెరికా తదితర దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. తాజాగా
ఈ జాబితాలో ఫ్రాన్స్ వచ్చి చేరుతోంది. ఈ పరిణామాల నడుమ క్రెమ్లిన్ కీలక
వ్యాఖ్యలు చేసింది. ‘పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఏం
మార్పు ఉండదు. పైగా ఇది ఉక్రెనియన్ల ఇక్కట్లను పొడిగించడమే అవుతుంది. వారి
జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుందని పేర్కొంది. ఉక్రెయిన్‌కు తేలికపాటి
యుద్ధట్యాంకులను అందజేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ గత
వారం వెల్లడించిన విషయం తెలిసిందే. దేశీయంగా తయారైన, 1980ల నుంచి వినియోగంలో
ఉన్న ఏఎంఎక్స్-10 ఆర్సీ తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు సరఫరా
చేయాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. దీంతో ఉక్రెయిన్‌కు ట్యాంకులను పంపించనున్న
మొదటి పాశ్చాత్య దేశంగా ఫ్రాన్స్ నిలవనుంది. ఇదే విషయంపై క్రెమ్లిన్ అధికార
ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ ఈ మేరకు స్పందించారు. అయితే ఫ్రాన్స్, రష్యాల
అధ్యక్షులు మెక్రాన్, పుతిన్‌లు ఇప్పటికీ పరస్పరం సంప్రదింపుల్లో ఉన్నట్లు
వెల్లడించారు. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నప్పటికీ ఒకరికొకరు అందుబాటులో ఉండటం
ప్రయోజనకరంగా ఉందని తెలిపారు. మరోవైపు బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడు బోల్సొనారో
మద్దతుదారుల అల్లర్లను ఖండిస్తున్నట్లు చెప్పారు. నూతన అధ్యక్షుడు లూలాకు
పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.