బీజింగ్ : చలితీవ్రత పెరగడంతో పొగమంచు కమ్మేస్తోంది. ముందు ఉన్న వారిని సైతం
గుర్తుపట్టలేనంతగా దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. పొగమంచు కారణంగా చైనాలోని
జియాంగ్జి ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామును ఘోర ప్రమాదం జరిగింది. పలు
వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొట్టడంతో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి
చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాంచాంగ్ కౌంటీలో జరిగిన ఈ
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు
స్థానిక మీడియా వెల్లడించింది. ఘటన జరిగిన ఒక గంట తర్వాత వాహనదారులు
అప్రమత్తంగా ఉండాలని నాంచాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు చేశారు.
భారీగా పొగమంచు కమ్మేసిన క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని
తెలిపారు. రోడ్లపై అప్రమత్తతో ఉంటూ డ్రైవర్లు ముందుకు సాగాలని సూచించారు.