తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్ పై రెండు క్షిపణి దాడులు
ప్రకటన చేసిన గంటల్లోనే ఉక్రెయిన్‌పై మిస్సైల్స్ దాడి
కీవ్ : సంప్రదాయ క్రిస్మస్ పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్
తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగాయి.
తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్ పై రెండు క్షిపణి దాడులు జరిగినట్లు
ఉక్రెయిన్ అధ్యక్ష యంత్రాంగం డిప్యూటీ హెడ్ కిరిలో టిమోషెంకో తెలిపారు.
14కుపైగా ఇళ్లు ధ్వంసమైనట్లు స్థానిక మేయర్ హోంచరెంకో చెప్పారు. ఖేర్సన్లో
జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. మరోవైపు బఖ్ముత్లోనూ ఇరుపక్షాల మధ్య దాడులు
చోటుచేసుకున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ తెలిపింది. కాల్పుల విరమణ
ప్రారంభానికి కొద్ది ముందు ఈ ఘటనలు జరిగినట్లు వెల్లడించింది.
మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన క్షణంలో దొనెట్స్క్‌పై
ఉక్రెయిన్ దాడులు జరిపిందని అక్కడి రష్యా అనుకూల అధికారులు తెలిపారు. నాటో
ఆయుధాలతో ఈ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా సుమారు 11 నెలలుగా
సాగుతున్న ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి పుతిన్ తాత్కాలిక విరామం ఇచ్చిన
విషయం తెలిసిందే. ఈ నెల 7న రష్యా సంప్రదాయ క్రిస్మస్ సెలవు నేపథ్యంలో
ఉక్రెయిన్‌లో 36 గంటలపాటు కాల్పుల విరమణను ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై
అమెరికా, ఉక్రెయిన్లు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇది రష్యా మరింత
పుంజుకొని దాడి చేసే ఎత్తుగడ అని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు
ముందు తాజా దాడులు చోటుచేసుకున్నాయి.
మాట తప్పిన రష్యా : ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే
రష్యా బాంబుల మోత మోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్క్స్ నగరంపై
రష్యా వైమానిక దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
కాల్పుల విరమణ సమయం 36 గంటల పాటు కొనసాగనుండగా నిబంధనలు ఉల్లంఘించిన రష్యా
దళాలు క్రామాటోర్క్స్ నగరాన్ని రెండుస్లార్లు మిస్సైల్స్‌తో విరుచుపడినట్లు
పేర్కొన్నారు. ఉక్రెయిన్ గగనతలంలో వైమానిక సైరన్లు వినపడినట్లు తెలిపారు. ఈ
దాడిలో ఓ నివాస భవనం దెబ్బతిందని అయితే అందులో ప్రజలు ఎవరూ లేరని
పేర్కొన్నారు. కాగా రష్యాలో ఆర్థడాక్స్ క్రిస్మస్ కోసం ఉక్రెయిన్‌లో 36 గంటల
కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలుజారీ చేసిన విషయం
తెలిసందే. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7
అర్థరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ
మంత్రిని ఆదేశించారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని
పేర్కొన్నారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్
చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి.
అయితే రష్యాతోపాటు ఉక్రెయిన్లోనూ నివసిస్తున్నవారు కూడా జనవరి 7తేదీన
ఆర్థడాక్స్ క్రిస్మస్ జరుపుకుంటారు. ఇదిలా ఉండగా 10 నెలలుగా కొనసాగుతున్న ఈ
యుద్ధంలో ఇప్పటి వరకు ఇరు దేశాల సైన్యంతోసహా లక్షలాది మంది ప్రాణాలు
కోల్పోయారు.
36 గంటల కాల్పుల విరమణ ప్రకటనకు తూట్లు : సంప్రదాయ క్రైస్తవులు పాటించే
క్రిస్మస్ (ఈ నెల 6, 7 తేదీల్లో) నేపథ్యంలో ఉక్రెయిన్‌లో 36 గంటలపాటు కాల్పుల
విరమణను పాటిస్తామంటూ ఏకపక్షంగా తాను చేసిన వాగ్దానాన్ని రష్యా ఉల్లంఘించింది.
ఆ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే తూర్పు ఉక్రెయిన్ నగరం ఖేర్సన్‌పై క్షిపణి
దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. బాధితులను
కాపాడేందుకు సహాయబృందాలు రంగంలోకి దిగాయి.
మా సైనికులు ముందుకు సాగకూడదనే : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
ఇదిలా ఉండగా రష్యా ఉద్దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇంతకుముందే
అనుమానాలు వ్యక్తం చేశారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వడం ద్వారా
రెట్టించిన ఉత్సాహంతో పోరును కొనసాగించాలన్నది రష్యా పాచిక అని ఆరోపించారు.
డాన్‌బాస్‌లో ముందుకుసాగుతున్న ఉక్రెయిన్ సైనికులను నిలువరించాలన్నది వారి
ఆలోచన అని ఆయన పేర్కొన్నారు.
పుతిన్ ఊపిరి పీల్చుకోవడానికే : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కాల్పుల విరమణ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ పుతిన్
ఊపిరి పీల్చుకునేందుకే ఈ విరామం ప్రకటించారని నేను భావిస్తున్నానని అన్నారు.