వాషింగ్టన్ : రష్యా దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు బ్రాడ్లీ యుద్ధ
వాహనాలను అందించాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బెడెన్
వెల్లడించారు. ఈ మేరకు కెంటకీకి ప్రయాణిస్తున్న సమయంలో విలేకరులు అడిగిన ఓ
ప్రశ్నకు బైడెన్ సమాధానంగా చెప్పారు. కొంతకాలంగా తమకు యుద్ధ ట్యాంకులు,
దీర్ఘశ్రేణి క్షిపణలు, ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు అందించాలంటూ అమెరికాపై
ఉక్రెయిన్ ఒత్తిడి తెస్తోంది. బ్రాడ్లీ మధ్యశ్రేణి సాయుధ పోరాట వాహనం. ఇది
చక్రాలతో కాకుండా ట్రాక్స్ ఆధారంగా నడుస్తుంది. తేలికపాటిదే అయినా ట్యాంకు
కంటే చురుగ్గా ఉంటుంది. ఇందులో 10 మంది సైనికులు సురక్షితంగా ప్రయాణించవచ్చు.
లేదంటే దీంట్లో అదనపు ఆయుధాలు, లేదా కమ్యూనికేషన్ పరికరాలను తరలించవచ్చు.
బ్రాడ్లీలను అమెరికా సైన్యం ఇప్పటికీ వినియోగిస్తోంది. ఉక్రెయిన్‌కు ఇప్పటికే
అమెరికా 2,000 పోరాట వాహనాలను అందించింది. ట్యాంకులను తునాతునకలు చేసే
చక్రాలతో నడిచే సాయుధ పోరాట వాహనాలను ఉక్రెయిన్‌కు అందించే విషయమై ఆ దేశంతో
త్వరలో చర్చలు జరపనున్నట్లు ఫ్రాన్స్ రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఏఎంఎక్స్-10 ఆర్సీగా వ్యవహరించే ఈ వాహనాలను ఎప్పటికల్లా అందిస్తామన్న అంశంతో
సహా వాటిలోని పరికరాల వినియోగంపై ఉక్రెయిన్ సైనికులకు అందించే శిక్షణపైనా
చర్చిస్తామని తెలిపింది.