బీజింగ్ : తమపై పలు దేశాలు విధిస్తున్న కరోనా ఆంక్షలు ఏమాత్రం ఆమోదయోగ్యమైనవి
కావని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ వ్యాఖ్యానించారు. ‘‘చైనాను
లక్ష్యం చేసుకొని కొన్ని దేశాలు మితిమీరిన ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు.
ఆయా దేశాలు అనుసరిస్తున్న ప్రవేశ పరిమితులకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు.
కొవిడ్ చర్యలను రాజకీయ లక్ష్యానికి ఉపయోగిస్తే..మేం దానికి దీటుగా
ప్రతిస్పందిస్తాం’’ అని ఆయన ఘాటుగా హెచ్చరించారు. చైనాలో కొవిడ్ విజృంభణతో
ఇప్పటికే అమెరికా, బ్రిటన్, భారత్, జపాన్ లాంటి దేశాలు ఆ దేశ ప్రయాణికులపై
ఆంక్షలు విధిస్తుండగా తాజాగా ఈ జాబితాలో అస్ట్రేలియా, కెనడా చేరాయి.