క్యాన్సర్ టీకా చికిత్స ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుందా? క్యాన్సర్‌ను
ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు రూపొందించిన సమర్థ మార్గం ఇలాంటి ఆశలే
రేకెత్తిస్తోంది. దీనిలోని కీలకాంశం- కణితులను గుర్తించే, తుదముట్టించే తీరును
రోగనిరోధకశక్తికి నేర్పించటం. నిజానిది ఫ్లూ, పోలియో వంటి టీకాల మాదిరిగా
జబ్బును నివారించదు గానీ క్యాన్సర్ తిరగబెట్టకుండా కాపాడుతుంది. కణితి
కణాల్లోని ప్రొటీన్లను ప్రమాదకరమైనవని గుర్తించేలా రోగనిరోధక శక్తికి తర్ఫీదు
ఇస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇమ్యూనో థెరపీ ప్రభావాన్ని మరింత
పెంచుతుందనీ ఆశిస్తున్నారు. రోగనిరోధక చికిత్సను ఎంఆర్ఎన్ఏ టీకాతో కలిపి
ఇవ్వగా చర్మ క్యాన్సర్ తిరగబెట్టే ముప్పు, దీంతో మరణించే అవకాశం 44% వరకు
తగ్గుతున్నట్టు బయటపడింది. అందుకే ఇది చాలా ఉత్సుకతను రేకెత్తిస్తోంది.
ఎంఆర్ఎన్ఏ ఆధారిత క్యాన్సర్ టీకా సామర్థ్యం ఓ చిన్నపాటి అధ్యయనంలో బయట పడటం
ఇదే తొలిసారి. పెద్ద పరిశోధనల్లోనూ మంచి ఫలితం కనిపిస్తే క్యాన్సర్ చికిత్సలో
విప్లవాత్మక మార్పులు రాగలవని భావిస్తున్నారు. అయితే ఈ టీకాను విస్తృతంగా,
చవకగా అందుబాటులోకి తేవటానికి చేయాల్సింది చాలానే ఉంది. ఆయా వ్యక్తుల
కణితుల్లోని జన్యువులకు అనుగుణంగా దీన్ని రూపొందించాల్సి ఉంటుంది కూడా.