ఉత్తరాఖండ్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆ రాష్ట్రంలోని
ఉత్తరకాశీలో బుధవారం తెల్లవారుజామున 2.19 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. దీంతో
గాఢనిద్రలో ఉన్నవారు లేచి వీధుల్లోకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్
సిస్మోలజీ ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. 5
కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఉత్తరాఖండ్‌లో గతంలో చాలాసార్లు భూప్రకంపనలు వచ్చాయి. తరచూ ప్రకంపనలు
ఏర్పడుతూండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.