చైనాతో పాటు అనేక ఇతర ప్రపంచ దేశాల్లో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో
భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతానికి భారత్ లో కరోనా వైరస్
వ్యాప్తి నెమ్మదిగా ఉన్నప్పటికీ.. చైనాలో లాంటి దుస్థితి మన వద్ద రాకముందే
మేల్కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో
భాగంగానే డిసెంబర్ 27న దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ మాక్
డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించిన కేంద్రం తాజాగా రాష్ట్రాలకు మరో లేఖ
రాసింది. ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలను
రాష్ట్రాలకు స్పష్టం చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మరో
లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, మాస్క్‌లు, మందులు, పిపిఇ కిట్ల కొరత లేకుండా
పేషెంట్ల వైద్య సహాయానికి అవసరమైన అన్ని వస్తువులను ముందుగానే తగినంత మేరకు
నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి హెల్త్
ఎమర్జెన్సీని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు
స్పష్టం చేసింది. ఆక్సిజన్ ప్లాంట్స్, వెంటిలేటర్లు, లాజిస్టిక్స్, వైద్యులు,
పారామెడికల్ సిబ్బంది సంఖ్య పెంపు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
సారించాలని కేంద్రం సూచించింది. ఆసుపత్రులు, పడకలతో రాబోయే విపత్తును
ఎదుర్కోవడానికి రాష్ట్రాలు సన్నద్ధం కావాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
సూచించింది. ఐసీయూ, ఐసోలేషన్, ఆక్సిజన్ సపోర్ట్ కలిగిన బెడ్స్, వెంటిలేటర్‌తో
కూడిన పడకల సంఖ్యను పెంచాలని కోరింది. అదేవిధంగా ఆసుపత్రుల్లో రోగుల తాకిడిని
ఎదుర్కొనేలా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సిందిగా
రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్
కేసులు దేశంలోకి ప్రవేశించిన నేపథ్యంలో కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు
వీలుగా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ
కార్యదర్శి రాజేష్ భూషణ్ మరో లేఖ రాశారు.