సియోల్: ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. అణ్వస్త్ర
సామర్థ్యమున్న రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. వీటికి జపాన్ను
తాకే సత్తా ఉంది. ఉత్తర కొరియా, చైనాలకు వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరిస్తామంటూ
నూతన భద్రతా వ్యూహానికి జపాన్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్షలు
జరగడం గమనార్హం. తాజా పరీక్షలో రెండు క్షిపణులను ఉత్తర కొరియాలోని
టాంగ్చాంగ్రి నుంచి ప్రయోగించారు. అవి 500 కిలోమీటర్లు ప్రయాణించి, కొరియా
ద్వీపకల్పం, జపాన్ మధ్య సముద్రజలాల్లో పడ్డాయి. ఈ అస్త్రాలు గరిష్ఠంగా 550
కిలోమీటర్లు ప్రయాణించాయని దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు. ఈ
క్షిపణులను నిట్టనిలువు కోణంలో ప్రయోగించారని, ప్రామాణిక పద్ధతిలో ప్రయోగిస్తే
అవి మరింత ఎక్కువ దూరం ప్రయాణించి ఉండేవన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో
దక్షిణ కొరియా భద్రతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. క్షిపణి ప్రయోగాలను
ఖండించారు. అంతర్జాతీయ సమాజ భద్రతను ఉత్తర కొరియా ప్రమాదంలో పడేస్తోందని
జపాన్ రక్షణ శాఖ ఉపమంత్రి టోషిరో ఇనో విమర్శించారు.