కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు
బీజింగ్ : చైనాలో కొవిడ్ కఠిన నిబంధనలు సడలించి పక్షం రోజులు పూర్తికాగా
ఒక్కసారిగా మహమ్మారి ఉద్ధృతి పెరిగింది. రాజధాని బీజింగ్‌తో పాటు పలు నగరాల్లో
ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలాచోట్ల గంటల తరబడి
నిరీక్షిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నాయి. చాలామంది
ఆసుపత్రుల బయట పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాల్లోనూ నిరీక్షిస్తూ కనిపించారు.
వీరిలో అధికసంఖ్యలో ప్రజలు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. ఒమిక్రాన్ వైరస్
రకం శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది డెల్టా వైరస్ అంత ప్రమాదకరమైనది కాదని
నిపుణులు చెబుతున్నారు.