భారత్‌కు అప్పగించేందుకు మార్గం దాదాపు సుగమం
ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లే
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకును భారీగా ముంచి లండన్‌కు పారిపోయిన వజ్రాల
వ్యాపారి నీరవ్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు
అప్పగించవద్దంటూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసే అవకాశామివ్వాలని వేసిన
పిటిషన్‌ను లండన్ రాయల్ కోర్టు (హైకోర్టు) కొట్టివేసింది. తనకు అనారోగ్య
సమస్యలున్నాయని, భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయంటూ
గత నెలలో నీరవ్ ఇదే కోర్టులో పిటిషన్ వేయగా, తిరస్కరించిన సంగతి తెలిసిందే.
దీంతో అతన్ని భారత్‌కు అప్పగించకుండా తప్పించుకునే మార్గాలు దాదాపు
మృగ్యమైనప్పటికీ ఐరోపా మానవ హక్కుల న్యాయస్థానంలో విజ్ఞప్తి చేసుకొనే
అవకాశమొక్కటే మిగిలింది. 2018లో భారత్ నుంచి పారిపోయిన నీరవ్ మోడీ పంజాబ్
నేషనల్ బ్యాంకును సుమారు రూ.16 వేల కోట్ల మేర మోసం చేయడంతో పాటు మనీ
లాండరింగ్, సాక్ష్యాల చెరిపివేత వంటి నేరాలకు పాల్పడినట్లు సీబీఐ, ఈడీలు
అభియోగాలు మోపాయి. ఈ కేసుల్లో 2019 మార్చి నుంచి అప్పగింత వారెంట్లు విచారణలో
ఉన్నాయి.
బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్ :11వేల కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడి
విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో షాక్
తగిలింది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై అక్కడి సుప్రీంకోర్టులో అప్పీల్
చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు చట్టపరంగా ఉన్న
అన్ని దారులు మూసుకుపోయినట్లు అయింది. ఫలితంగా ఆయనను త్వరలోనే భారత్‌కు
తీసుకువచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్
మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేర మోసం చేశాడు. ఈ విషయం
బయటకు రావడంతో 2018లో దేశం వీడి పారిపోయాడు. 2019లో లండన్‌లో అరెస్టయ్యాడు.
అప్పటి నుంచి అక్కడి జైలులోనే ఉంటున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని
గతనెలలోనూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆయన అప్పీల్‌ను రిజెక్ట్ చేసింది.
దీంతో చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరుతూ లండన్
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాను భారత్‌కు వెళ్తే ఆత్మహత్య చేసుకోవాలనే
ఆలోచనలు వస్తాయని, మానసికంగా సమస్యలున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు.
న్యాయస్థానం వీటిని తోసిపుచ్చి అప్పీల్‌ను రిజెక్ట్ చేసింది. అయితే నీరవ్‌కు
ఇంకా ఓ అవకాశం ఉంది. తనను భారత్‌కు అప్పగించే విషయంపై ఐరోపా సమాఖ్య మానవ
హక్కుల కోర్టును ఆయన ఆశ్రయించవచ్చు.